రైతులకు సకాలంలో ఎరువులు అందించాలిపొరపాటు దొర్లితే చర్యలు ఖాయం

అధికారులు హెచ్చరిక
మెదక్‌, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ ఎరువుల కొరత ఏ మాత్రం లేదని, ఉన్న ఎరువులను సక్రమంగా రైతులకు పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఏ ప్రాంతములో ఎరువులు అవసరమో..ఒక రోజు ముందుగా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు తెలియజేసినట్లేతే ఎరువులు పంపనున్నట్టు తెలిపారు. జిల్లాలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడి కింద 102 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అయితే ఇప్పటివరకు రూ. 69కోట్లు మాత్రమే నేరుగా రైతులకు బ్యాంకు ఖాతాలోకి జమ చేశామన్నారు. మిగిలిన ఇన్‌పుట్‌ సబ్సిడి డబ్బులు ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని లేనిచో అట్టి డబ్బులు ప్రభుత్వానికి తిరిగి పంపించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొన్ని మండలాల్లో కొంతమంది రైతులు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాల్సి ఉందని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన ఖాతాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణం ఖాతాగాని, సెవింగ్స్‌ ఖాతా ఉన్నట్లైతే ఆ విషయాన్ని రైతులకు తెలియజేసి ఆ ఖాతాలోకి ఇన్‌పుట్‌ సబ్సిడి డబ్బులు జమ చేయాలని బ్యాంకు అధికారులకు కమిషనర్‌ సూచించారు.బ్యాంకు అధికారులు రైతుల పాత బకాయి ఉన్నట్టయితే ఇన్‌పుట్‌ సబ్సిడి డబ్బులు మినహాయించుకోకూడదని బ్యాంకు అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో అర్హత గల రైతులందరికి, రుణ అర్హత కార్డులు ఉన్న వారికి, పంట రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులకు ఆయన కోరారు. జిల్లాలో గత సంవత్సరం రూ. 885కోట్లు పంట రుణాలు రైతులకు బ్యాంకుల ద్వారా అందించామని, ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అధిగమించి రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ యాంత్రికరణ కింద రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేయడానికి బ్యాంకు అధికారులు కూడా సహకరించాలని, ఈ సంవత్సరం వ్యవసాయ యాంత్రికరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు నిధులు విడుదల చేశామన్నారు. వ్యవసాయ యాంత్రికరణకు రైతులను గుర్తించి త్వరలో యూనిట్లు గ్రౌండ్‌ చేసే విధంగా వ్యవసాయాధికారులు కృషి చేయాలని కమిషనర్‌ సూచించారు. కమీషనర్‌ వ్యవసాయాధికారులతో మండలాల వారిగా ఎరువుల పంపిణీ, పంట రుణాలు మంజూరు, ఇన్‌పుట్‌ సబ్సిడి రైతులకు అందజేతపై, ఎంత విస్తీర్ణములో పంట సాగు చేసిందీ, ఇంకా ఎంత విస్తీర్ణములో పంటలు సాగు చేయవలసి ఉన్నది, ఆగస్టు మాసములో ఎంత ఎరువులు అవసరం, వ్యవసాయ యాంత్రికరణ తదితర విషయాలపై సమీక్షించారు. జహీరాబాద్‌ ఏరియాలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడి రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడంలో జాప్యానికి గల కారణాలను తెలియజేయలేక పోయిన జహీరాబాద్‌ ఎడిఎకు చార్జీ మెమో జారీ చేయవలసిందిగా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను కమిషనర్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు 33,020 టన్నుల ఎరువులు జిల్లాకు వచ్చాయని, ఇంకా 6వేల టన్నుల ఎరువులు జిల్లాకు అలాట్‌మెంట్‌ అయిందని తెలిపారు. జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాకు ఇబ్బంది కలుగకుండా ఆర్డీఓలు, మండల తహాసీల్దార్ల, పోలీసులు చేపట్టారని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగితే సంబంధిత వ్యవసాయాధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరిం చారు. వ్యవసాయశాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఆత్మ పిడి రాజేందర్‌, ఎల్‌డియంపిఎంకె.ప్రసాద్‌, వ్యవసాయ శాఖ ఎడిలు, మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.