రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాల వివరాలు ఇవ్వాలని పిటిషనర్లను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ల వివరాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రయోజనాలు అందాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రయోజనాలు నేరుగా రైతుల కుటుంబ సభ్యులకే అందజేయాలని, మధ్య వర్తులను ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.