రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

కడప : విద్యుత్‌ కోతలకు నిరసనగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అక్కడికి వచ్చిన డీఈ సురేష్‌ను రైతులు చుట్టుముట్టారు. రైతుల ఆందోళనతో రహదారికిరువైపుల భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.