రైతుల వ్యవసాయ బావుల వద్ద ఆటోమాటిక్ స్టార్టర్ లు తొలగించాలానే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ధర్నా…………..
బోనగిరి టౌన్ (జనం సాక్షి):– రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ బావుల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్ లు తొలగించాలనే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించిడం జరిగింది అనంతరం డివిజనల్ ఇంజనీర్ శ్యామ్సుందర్ కు వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్బంగా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు అతహర్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ బావుల వద్ద ఆటోమాటిక్ స్టార్టర్ లు తొలగించాని ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కరెంటు సరిగ్గా ఉండకపోవడం వలన ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం లో రైతులున్నారని అలాంటి సమయం లో ఆటోమేటిక్ స్టార్టర్ లు ఉంటే కరెంటు ఎప్పుడొచ్చిన పొలాలల్లో నీళ్లు పారి రైతులకు ఉపశమనంగా ఉంటుందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వానికి అంతే పట్టింపు ఉంటే ఎమ్మెల్యే లు, ఎంపి లు, మంత్రుల ఫామ్ హౌస్ లలో ఆటోమేటిక్ స్టార్టర్ లు తొలగించాలని అంతే కానీ రెక్కాడితే డొక్కాడని బీద రైతులకు అన్యాయం చేయడం సబబు కాదని వాపోయారు.కేసీఆర్ వెంటనే ఆటోమేటిక్ స్టార్టర్ లు తొలగించే ఆలోచన విరమించుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున రైతు ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రైతులు చంద్రయ్య, కిష్టయ్య, పెంటయ్య, నర్సయ్య, ఎల్లయ్య మరియు పార్టీ జిల్లా ఉపాధ్యాక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షకీల్, పట్టణ యూత్ అధ్యక్షులు ఆమెర్,యూత్ కార్యదర్శి రాకేష్,పట్టణ మైనారిటీ అధ్యక్షులు వాహేద్, ప్రధాన కార్యదర్శి సోహైల్, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,వసీమ్ తదితరులు పాల్గొన్నారు.