రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మండల పార్టీ అధ్యక్షుడు రణం.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 29, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వాగ్య అనే రైతు ప్రమాదవశత్తు పొలంలో పడి చనిపోయారు . ఈ విషయం తెలుసుకున్న సీనియర్ నాయకుడు రణం శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు . ఈరోజు రణం పెద్ద కూతురు రణం శ్రీనిధి పుట్టిన రోజు సందర్బంగా అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాటమే తృప్తి ఇస్తుందని రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవి యాదగిరి,మాజీ సర్పంచ్ బుజ్జి బాహ్య,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area