రైతు క్లబ్‌లు ఏర్పాటు లక్ష్యం

కాచిగూడ: ఆదివారం కాచిగూడలోని జాగృతి భవన్‌లో గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వికాస సదస్సు కార్యక్రమానికి నాబార్డ్‌ సీజీఎం మోహనయ్య తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి వేదికగా ఉపయోగపడుతున్న 10 వేల రైతు క్లబ్‌లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా నిర్ణయించినట్లు, రైతులు సుస్థిర వ్యవసాయం వైపు దృష్టి మరల్చేలా కృషి చేస్నున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఫార్మర్స్‌ టెక్నాలజీ కార్పస్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేశామాన్నారు. నాబార్డ్‌ ద్వారా 10 లక్షల మొక్కలు నాటడం కాకుండా పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఔషద విలువల కల్గిన వృక్ష సంపద పోస్టర్లను రూపొందించి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవీకే రావు, ఆరెస్సెస్‌ గ్రామ వికాస ప్రముఖ్‌ ఆకుతోట రామారావు, క్షేత్ర సంచాలక్‌ టీవీ దేశ్‌ముఖ్‌, స్తంభాద్రిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.