రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
వరంగల్ : యశ్వంతాపూర్ ఫార్మసీ కళాశాల వద్ద కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు.