రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అనంతపురం : జిల్లాలోని బెలుగప్ప మండలం ఎన్‌. గుండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను ఐషర్‌ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రికి తరలించారు.