రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : జాతీయ రహాదారి పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిగ్రి సప్టిమెంటరీ పరీక్షలు రాసి ద్విచక్రవాహానంపై వెళుతుండగా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్దఎదురుగా వచ్చిన వాహానం  టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహానాన్ని ఢీ కొనడంతో వేల్పూర్‌ మండలం అక్లూరు  గ్రామానికి చెందిన దశరథ్‌(29) అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్‌(26)ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. జక్రాన్‌పల్లి ఎసై జగదీశ్వర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.