రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్‌: బూత్పూరు సమీపంలో రహదారి పై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని అదుపు తప్పిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం క్లీనర్‌ శేఖర్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా నుంచి షాద్‌నగర్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.