లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం
లండన్‌ జూలై 28 (జనంసాక్షి):
అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారులు పాల్గోన్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ విజయం సాధించారు. గ్రూపు-డి తొలి మ్యాచ్‌లో బెల్జియం క్రీడాకారుడు టానీపై 21-14,21-12 తేడా తో గెలుపోందారు. కాగా ఆంధ్రాప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో జ్వాలా-దిజు జోడీ జట్టు ఇండోనేషియాకు చెందిన క్రీడాకారులు ఆహ్మద్‌, నెట్సర్‌ల చేతిలో ఘోర పరాజయం పాలయ్యరు. ఇండోనేషియా జట్టు 21-16, 21-12 స్కోర్‌తో భారత్‌ను ఓడించింది.
భారత క్రీడాకారుల ఈ వెంట్స్‌ :
అర్చరీ : పురుషుల టీమ్‌ విభాగం, యంత్‌ తాలుక్‌దార్‌, తరుణ్‌దార్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, రాహుల్‌ బెనర్జీ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ జ్వాల, పొన్నప్ప వర్సెస్‌ పుజి, కాకివా (జపాన్‌) రాత్రి 7:20 నుంచి బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌: పారుపల్లి కశ్యప్‌ వర్సెస్‌ నాట్‌ యుహాన్‌ (బెల్జియం) మధ్యాహ్నం 1.42నుంచి బాక్సింగ్‌: పురుషుల బాంటమ్‌ మెయిట్‌ 57కేజీలు, రౌండ్‌32, శివథాపా బాక్సింగ్‌: పురుషులు మిడిల్‌ వెయిట్‌ 75కేజీలు, రౌండ్‌32, విజేందర్‌కుమార్‌, రాత్రి 7నుంచి
రోయింగ్‌: పురుషుల సింగిల్స్‌ స్కల్స్‌, సపర్ణ సింగ్‌, సాయంత్రం 4:30నుంచి
ఘాటింగ్‌:పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, విజయ్‌కుమార్‌, సాయంత్రం 4నుంచి టేబుల్‌ టెన్నిస్‌: మహి ళల సింగిల్స్‌ తొలి రౌండ్‌, సౌమ్యజిత్‌ వర్సెస్‌ గుస్తావో(బ్రెజిల్‌) సాయంత్రం 8నుంచి
టెన్నిస్‌: మహిళల డబుల్స్‌, రష్మి చక్రవర్తి, సానియా మీర్జా వర్సెస్‌ చాంగ్‌, సు-వి-సి (త్రైపీ) ఉదయం 9:30నుంచి
వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళల 48కేజీలు: సోనియా చాను,
రాత్రి 7:30నుంచి