లక్ష్మణ్‌లాంటి మంచి బ్యాట్స్‌మెన్‌ను భారత క్రికెట్‌ కోల్పోతుంది: బీసీసీఐ

న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మన్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించడంపై మాట్లాడుతూ లక్ష్మణ్‌లాంటి సొగసరి బ్యాట్స్‌మెన్‌ను భారత్‌ క్రికెట్‌ కోల్పోతోందరి తెలిపింది. భారత క్రికెట్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత వీవీఎస్‌ లక్ష్మణ్‌దని బీసీసీఐ ప్రశంసించింది. 16 ఏళ్ల సుదీర్ఘ కేరీర్‌లో లక్ష్మణ్‌ భారత్‌కు అందించిన విజయాలు మరవలేనవని బీసీసీఐ వివరించింది.