లక్ష్మణ్‌, సునీల్‌ జోషిలకు కర్ణాటక క్రికెట్‌ ప్రతినిధుల సన్మానం

బెంగళూరు: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వి.వి.ఎస్‌. లక్ష్మన్‌, సునీల్‌ జోషిలను కర్ణాటక క్రికెట్‌ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది. భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు ఆటను వారు వీక్షించారు. అనంతరం లక్ష్మణ్‌, సునీల్‌ జోషిలకు కర్ణాటక క్రికెట్‌ సంఘం ప్రతినిధులు స్మరణ ఫలకాన్ని అందించి సన్మానించారు. ప్రేక్షకులు పెద్దఎత్తున కరతాళధ్వనులతో ఇద్దరికీ అభినందనలు తెలిపారు.