లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శక్రవారం భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల ప్రవాహంతో సెన్స్‌క్స్‌ 410 పాయింట్ల లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరి 17,496 వద్ద ముగిసింది. జనరల్‌ యాంటీ ట్యాక్స్‌ అవాయిడ్‌న్స్‌ రూల్స్‌(గార్‌) మార్గర్శకాలను గురువారం రాత్రి విడుదల చేయడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ పై ప్రభావం చూపింది. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి. విదేశీ,దేశీయ కొనుగోళ్లతో అటు నిఫ్టీ కూడా 120 పాయింట్లు లాభపడి 5,269 వద్ద ముగిసింది.