లాభాలబాటలో గిడ్డంగుల శాఖ
హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఈ ఏడాది వూహించని లాభాలను ఆర్జించింది. 2011-12 సంవత్సరానికి గాను 142 కోట్లు లాభం వచ్చినట్లు ఈ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ తెలిపారు. మెరుగుపడిన ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ లాభాల నుంచి రూ.10కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డ్ నుంచి నిధులు తెస్తున్నామని ఆయన తెలియజేశారు.