లారీ దూసుకెళ్లి విద్యార్థి మృతి
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ ఉదయం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న మారం భార్గవ్ (14) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థి బంధువులు లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని పాఠశాలలో బంధించి ఆందోళన చేపట్టారు.