లారీ బోల్తా డ్రైవర్,క్లీనర్ మృతి
పూసపాటిరేగ: విజయనగం జిల్లా పూసపాటిరేగ మండలంలో జాతీయ రహదారిపై కుప్పెర్ల సమీపంలో చంపాపతి వంతెనపై నుంచి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ వరమరాజు, క్లీనర్ మల్లేశ్వరరావులు మృతిచెందినట్లు పోలీసులు తెలియజేశారు. మృతులు విజయవాడకు చెందినవారుగా తెలుస్తోంది.