లింగాపురం గ్రామంలో ఘణంగా శ్రీరామనవమి వేడుకలు

లింగాపురం గ్రామంలో ఘణంగా శ్రీరామనవమి వేడుకలు
జనం సాక్షి, చెన్నరావు పేటమండలం లోని లింగాపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘణంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలోని శివాంజనేయ స్వామి ఆలయంలో విభూతి శివకుమార్ శైలజ,వెంగళదాసు రాజేందర్ సుజాత దంపతులు సీతరాముల వివాహన్ని వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు భద్రాచలం నుండి ప్రత్యేకంగా తెప్పించిన ముత్యాలు తళంబ్రాలను సీతారాములపై అక్షింతలు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో శివాంజనేయ ఆలయానికి తరలివచ్చి వివాహాన్ని తిలకించారు.ఈ కార్యక్రమంలో లింగాపురం సర్పంచ్ తప్పేట రమేష్,చిన్న గురిజాల మాజీ సర్పంచ్ అమిరెడ్డి శంకరయ్య, పిఏసిఎస్ మాజీ వైస్ చైర్మన్ రాజబోయిన దూడయ్య,మందాటి బుచ్చిరెడ్డి,నామోజు బ్రాహ్మచారీ, వెంగళదాసు లక్ష్మినారాయణ,అల్లం సురేందర్,పోతు సాంబయ్య,అమిరెడ్డి కర్ణాకర్,సమ్మెట రంగయ్య,సబ్బని నాగరాజు,భూషణబోయిన ఐలయ్య,మినుముల రాజేందర్, అమిరెడ్డి రాజు,గన్నేవరం శంకరయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.