లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌ సభ సమావేశమైన కొద్దిసేపటికే నల్లధనం, పాకిస్థాన్‌లో హిందువుల అక్రమకేసులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.