వంశధార కుడి కాలువకు గండి

గార: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సమీపంలో వంశధార కుడి కాలువకు నాలుగు మీటర్ల మేర గండి ఏర్పడింది. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో వరి నారుమళ్లు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర వంశధార సీఈ జగన్మోహనరావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కృష్ణమూర్తి తదితరులు గండిని పరిశీలించారు. సీఈ మాట్లాడుతూ 24 గంటల్లో గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రస్తుతం కాలువలో 60-70 క్యూసెక్కుల నీరు ఉంది. వంశధార ఒడిశా పరివాహక ప్రాంతంలో వర్షాలు ఉధృతంగాకురుస్తుండడంతో వంశధార పోంగుతోంది.