వరంగల్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్న మెంట్‌

వరంగల్‌ : ఈ నెల 24 నుంచి 27 వరకు వరంగల్‌లో అంతర్జాతీయ రేటింగ్‌ చెన్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తెలియజేశారు. ఈ పోటీలను వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో ఉన్న విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు అంతర్జాతీయ రేటింగ్‌ కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ( ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) కార్యదర్శి డా. ఎర్రా శ్రీధర్‌ రాజు, చెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.వి. రాజగోపాల్‌, ఉపాధ్యక్షుడు టి.డి. టామీ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొల్లం సంపత్‌ తదితరులు పాల్గోన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు సంబంధించిన కరపత్రిక, గోడపత్రిక, బ్యానర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.