వర్షాకాల సమావేశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిశారు.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు,ఇతర కీలక అంశాలపై దాదాపు అరగంటపాటు చర్చించారు.వ్యవసాయ ఉత్పత్తి పెంపు,లాభదాయకత రైతు పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై గవర్నర్‌ల కమిటీ చేసిన సిఫారసులపై కూడా చర్చలు జరిపారు.సిఫారసులపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రధానికి చెప్పారు.రాష్ట్రపతి కార్యాలయం  మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.