వాగులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఏనుగుగడ్డవాగులో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి మృతిదేహం లభ్యమైంది. మృతున్ని కంచికచర్లకు చెందిన పొరమ సురేందర్‌గా గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి సురేష్‌ కోసం  గాలింపు  చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఏడుగురు విద్యార్థులు కలిసి వాగు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వరద ఉద్థృతికి ఇద్దరు విద్యార్థులు గల్లంతుకాగా.. ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నారు.