వాన్‌పిక్‌ కేసులో ఛార్జీషిట్‌ దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌ వ్యవహారంపై సీబీఐ నాలుగో ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఈ రోజు సీబీఐ ఆధికారులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో తొమ్మిది బాక్స్‌లలో 177 పేజీల ఛార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. దీనికి అనుబంధంగా మరో 284 డాక్యుమెంట్లను కూడా వారు కోర్టుకు అందజేశారు. ఈకేసులో 14 మందిని నిందితులు ఉన్నట్టు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఏ-1గా జగన్మోహన్‌రెడ్డి, ఏ-2గా విజయసాయిరెడ్డి, ఏ-3గా నిమ్మగడ్డ ప్రసాద్‌, ఏ-4గా మోపిదేవి వెంకటరమణ, ఏ-5గా మంత్రి ధర్మాన ప్రసాద్‌,  ఏ-6కేవీబ్రహ్యానందరెడ్డి, ఏ-7 ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌, ఏ-8 శామ్యూల్‌, ఏ-9 నిమ్మగడ్డ ప్రకాశ్‌, ఏ-10 వాన్‌పిక్‌ ప్రాజెక్టు, ఏ-11 జగతి పబ్లికేషన్స్‌, ఏ-12 భారతీ సిమెంట్స్‌, ఏ-13 కార్మెల్‌ ఏసియా, ఏ-14సిలికాన్‌ బిల్డర్స్‌లను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 120 (బి), 409, 419, 409, 419, 420, 468, 477 (ఏ)  సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసులో సీబీఐ ఇది వరకే మూడు ఛార్జీషీట్లను ఛార్జీషీట్లను కోర్టుకు సమర్పించింది.