వామ్మో కుక్కలు జాగ్రత్త…వామ్మో కుక్కలు జాగ్రత్త


కుక్కే కదా అనుకుంటే ప్రాణాలకు ముప్పు
రాంపురం సర్పంచ్ కి యాక్సిడెంట్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేరు…నర్సులు లేరు…?

కొత్తగూడ మార్చి 21 జనంసాక్షి:ప్రధానంగా ఎక్కువ యాక్సిడెంట్స్ కేసులు కుక్కలతోనే జరుగుతున్నాయి.మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో జంగావానిగూడెం (రాంపురం) సర్పంచ్ స్వామి కి తృతిలో తప్పిన ప్రమాదం…ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో బైక్ పై నుండి కింద పడి కుడి చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలు కావడం జరిగింది.వెంటనే కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.కానీ అక్కడ డాక్టర్ లేడు…కనీసం స్టాఫ్ నర్సులు సైతం లేరు.ఒక్క ఏఎన్ఎం అనిత ఉండడం జరిగింది.ఇది తెలుసుకున్న108 ఫస్ట్ రెస్పాండర్ రవి తక్షణమే అక్కడికి వెళ్లి ఆరోగ్య కేంద్రంలో ఎవరూ లేకపోవడంతో వారిద్దరే ప్రథమ చికిత్స అందించడం జరిగింది.గాయపడిన సర్పంచిని మెరుగైన చికిత్స కోసం నర్సంపేటకు కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లడం జరిగింది.