వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు సాధిస్తామని ఐఎన్‌టీ యూసీ, ఏఐటియుసి నేతలు ప్రకటించడం విడ్డూ రంగా ఉందని ఐఎన్‌టీయూసీ (ఆర్‌సిఎంఎస్‌) భూపాలపల్లి బ్రాంచి అధ్యక్షుడు జోగ బుచ్చయ్య పేర్కొన్నారు. శనివారం ఏరియాలోని కేటీకే 6వగ ని ఆవరణలో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్సి వెంకట్రావ్‌, ఏఐటీయూసీ నేత సీతారామయ్యలు ఎన్నికల ముందే వారసత్వ ఉద్యోగాలను ఇప్పించాలని డి మాండ్‌ చేశారు. 9వ వేజ్‌బోర్డుకు సంబందించిన ఏరియర్స్‌నుంచి సమ్మె కాలంలో ఇచ్చిన రూ. 25 వేల అడ్వాన్స్‌ను కోత విధించడం పై ఏఐటీయూ సీ కోర్టులో స్టేతెచ్చి డ్రామాలాడుతుందని చెప్పా రు. ప్రస్తుతం నాయకులు ఏరియర్స్‌పై దొంగాట ఆడుతున్నట్లు విమర్శించారు. అదేవిధంగా ప్రకృతి కి విరుద్ధంగా భూగర్బంలో పనిచేస్తున్న కార్మికుల కు ఆదాయపుపన్ను రద్దు చేయాలని యాజమా న్యాన్ని కోరారు. ఇందు కోసం అన్ని కార్మిక సం ఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసిన దృష్ట్యా సకల జనుల సమ్మె కాలంలో రూపాయలు 25 వే లు అడ్వాన్స్‌ మాఫిచేస్తూ ఆకాలంలో ప్రత్యేక లీవు లను మంజూరు చేయాలని కోరారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 400 కోట్లకు పైగా లాభాలు ఆర్జించిన సంస్థ కార్మికులకు ఎన్నికల ముందే బో నస్‌ను 16శాతం నేంచి 25శాతం పెంచి ఇవ్వాల ని డిమాండ్‌ చేశారు. క్వార్టర్లలో నివాసముంటున్న కార్మికుల నుంచి చార్జి రికవరి బేసిక్‌లో 1శాతం నిలిపివేయాలని దీని మూలంగా ఒక్కో కార్మికుడు రూపాయలు 500 వరకు నష్టపోతున్నట్లు తెలి పారు. మైనింగ్‌స్టాఫ్‌కు విటిసిలో టీ, టిఫిన్‌, భోజ నం పెడుతున్నారని అదేవిధంగా ప్రతి కార్మికుడికి అందించాలని ఈ విధంగా ఎన్‌సిడబ్యూఏ యాక ్‌్టలో ఉందని గుర్తుచేశారు. జనరల్‌ మజ్ధూర్‌ కార్మి కులను అత్యవసరంగా గుర్తించాలని, ఎస్సీ, ఎస్టీ కార్మికులకు ప్రమోషన్లలో మాత్రమే రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని వీటితో పాటు క్వార్టర్స్‌ అలాట్‌మెం ట్‌లలో కూడా రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ జయంతి, క్రిస్‌మస్‌, రంజాన్‌ పండుగలను జాతీయ సెలవు దినాలుగా యాజ మాన్యం ప్రకటించాలని కోరారు. గుండె సంబంధి త వ్వాధితో బాధపడుతున్న వారికి సూటబుల్‌ ఉ ద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమా వే శంలో ఐలుమల్లు, ఉస్కి చంద్రయ్య, బ్రహ్మయ్య, రాజేందర్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.