వారిద్దరి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్దం లేదు: పొంగులేటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డికి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్ధం లేదని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శంకరపల్లి, నేదునూరు ప్రాజెక్టుల విషయంలో జెన్‌కోకు గ్యాస్‌ లింకేజీ ఇస్తేనే నిర్మాణం వేగవంతమవుతుందన్నిది ప్రభుత్వ వాదన అని చెప్పారు. పోలవరం విషయంలో ముంపు బాధితుల్లో ఉన్న  అపోహలను పూర్తిగా తొలగించాలని, మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఖమ్మంలో చేపట్టిన ఇందిరమ్మ బాట విజయవంతమైందన్న పొంగులేటి బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.