వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం
వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద వాసవి యూత్ క్లబ్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు యామా సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం అమావాస్య తిథిని పురస్కరించుకొని ఆసుపత్రికి వచ్చే మహిళలు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి యూత్ క్లబ్ ఆర్సీ రాచకొండ శ్రీనివాస్, జడ్సీ గుమ్మడవెళ్లి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పురాణాల్లో అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్పబడిందని తెలిపారు.గత 15 నెలలుగా అమావాస్య రోజున పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ సెక్రటరీ మాడుగుల మణికంఠ, ట్రెజరర్ బుద్ద శ్రీనివాస్ గుప్త, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.