వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి

శ్రీకాకుళం, జూలై 30 : పలు కారణాలతో ప్రభుత్వం రద్దుచేసిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని జాతీయ వికలాంగుల భక్కులవేధిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాలరావు డిమాండ్‌ చేశారు. టెక్కలిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో టెక్కలి మండలశాఖ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు నంబూరు షణ్ముఖరావు మట్లాడుతూ పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. వికలాంగుల హక్కుల సాధన కోసం ఇతర ప్రజాసంఘాల మద్ధతు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వికలాంగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో టెక్కలి మండలశాఖ అధ్యక్షుడు కోటేశ్వరరావు, రత్నాల శ్రీనివాసరావు, కొల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.