విఘ్నేశ్వరుడి పూజలో సిద్ధార్థ:-

మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు తనయుడు,ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల విగ్నేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన మట్టి,గంగానది జలంతో తయారుచేసిన విగ్రహం ద్వారా పూజలు నిర్వహించి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులో ఉండేలా ఆశీర్వదించాలని కోరారు. దేవాలయ కమిటీ సభ్యులు పైడిమరి సురేష్, బండారు కుశలయ్య,శ్రీనివాస్ బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్ యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్ భక్తులు పాల్గొన్నారు.