‘విజ్ఞాన్‌ బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌:ఎంసెట్‌ ఏఐఈఈఈ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా బీటెక్‌ ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది.ఎంసెట్‌ ఏఐఈఈఈ ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు రాయితీ ఇవ్వనున్నట్లు వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ తెలిపారు.జులై 4,5,6,7 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.ఐఐటీలో 18,500లోపు ఏఐఈఈఈలో 15 వేల లోపు ఎంసెట్‌ ఐదు వేలలోపు ర్యాంకు వచ్చిన వారికి నాలుగేళ్ల పూర్తి ఫీజు రాయితీ ఉంటుందని తెలిపారు.