విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యం: కెఎల్ఆర్ ఫౌండేషన్ అధినేత శకుంతల రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 22 (జనం సాక్షి): విద్య తోనే సమాజ ప్రగతి సాధ్యమని ఆ దిశగా తాను ఎంతో మంది పేదల విద్యకు సహాయ సహకారాలు అందిస్తున్నానని కెఎల్ఆర్ ఫౌండేషన్ అధినేత శకుంతల రెడ్డి పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని  రెయిన్‌బో  చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వారు హైదరాబాద్ కూకట్ పల్లి లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు కెఎల్ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు.
ప్రముఖ దర్శక నిర్మాత రెయిన్‌బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ నిర్వాహకులు మోహన్ నటుడు మూసా అలీఖాన్ హీరో విజయ్ భాస్కర్ పలువురు సినీ సేవా ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ముందుగా చిన్నారులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి ప్రతిభ కనబరిచిన వారికి
ప్రముఖులతో పాటు శకుంతల రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు. అలాగే ఎన్నో సామాజిక సేవలతో నిత్యం ప్రజలకు దగ్గరైన కెఎల్ఆర్ ఫౌండేషన్ అధినేత శకుంతల రెడ్డి ని శాలువ కప్పి షీల్డ్ అందచేసి ఘనంగా సత్కరించారు.  తన సేవలను గుర్తించి ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించిన రెయిన్‌బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వారికి వివరించిన మూసా అలీఖాన్ కు శకుంతల రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు, పలువురు కళాకారులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.