విద్యారంగంలో మనం చివరి నుండి రెండోస్థానం -జయప్రకాశ్‌

హైదరాబాద్‌: ప్రపంచంలోనే విద్యారంగంలో చివరి నుండి రెండవస్థానంలో మన దేశం ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఈ దేశంలో మంచి ప్రమాణాలతో విద్యను అందించాలనే స్పృహ సమాజానికి ఇంకా రాలేదన్నారు. హైదరాబాద్‌లో అబ్యాస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటి ఆవిష్కరణలో ఈరోజు ఆయన పాల్గోని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాభివృద్దికి స్థలాల కేటాయింపు శాశ్వతంగా ఇవ్వకపోయినా లీజు పద్దతిలో అయినా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఐటీ అభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. విద్యాభివృద్దికి కొత్త సంస్థలు రావటం శుభ పరిణామమని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అన్నారు.