విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) :
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డి మాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదివా రం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దహనం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు సమ స్యలకు నిలయాలుగా మారాయన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్దికి కృషి చేయడంలో పాలకులు విఫలం చెందారని విమర్శించారు. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరిం చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈకార్య క్రమంలో ఆసంఘం నాయకులు రాకేష్‌, శ్రావణ్‌్‌, వినయ్‌, హరికృష్ణ, రవి, రాకేష్‌,శ్రీను, రాజ, ప్రవీణ్‌్‌,వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.