విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీరు తగ్గడం, గ్యాస్‌ సరఫరా కూడా తక్కువ కావడం.. తదితర అంశాలతో విద్యుత్‌ ఉత్పాదన తగ్గిందన్నారు. ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ను కలిసి అదనపు విద్యుత్‌ కేటాయించమని విజ్ఞప్తిచేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ రాయితీ రూ.6,100 కోట్లు భరిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. విద్యుత్‌ కొరతతో ఒక్క ఎకరా పొలం ఎండిపోయినట్టు తన దృష్టికి తీసుకువస్తే తాను వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.