విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

మెట్‌పల్లి : మెట్‌పల్లి మండలం రాంచంద్రం పేట గ్రామంలో ఓ కారు అర్థరాత్రి రెండుగంటల సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వెళ్లిపోయింది. విద్యుత్‌ తీగలు ఆరుబయట నిద్రిస్తున్న ఈర్ల రాజం అనే వ్యక్తి పై పడ్డాయి.వెంటనే  అధికారులకు సమాచారం అందించారు.ట్రాన్స్‌కో సిబ్బంది ఈ ఉదయం  మరమ్మతులు చేపట్టారు.