-వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
మునిసిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 2 (జనంసాక్షి):
ప్రశాంత వాతవరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని మునిసిపల్ చైర్ పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో స్ట్రీట్ వెండర్స్ ప్రతిష్టించిన వినాయకుడి వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భక్తి శ్రద్దలతో ప్రశాంత వాతవరణంలో పండుగను జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ వెండర్స్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.