వినాయక మండపాలకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి:విద్యుత్ శాఖ ఏఈ సురేష్

కొత్తగూడ సెప్టెంబర్ 17 జనంసాక్షి:వినాయక మండపం వద్ద కనెక్షన్ కు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సురేష్ అన్నారు.కొత్తగూడ,గంగారం మండల ప్రజలకు వినాయక మండపాల ఏర్పాటుకు సిద్దమవుతున్న నిర్వాహకులు విద్యుత్ వినియోగం కోసం తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి.
1) 1000 వాట్స్ వరకు రూ.1560.
2) 1000 నుండి 1500 వాట్స్ లోడ్ వరకు రూ.2300.
3) 1500 నుండి 2000 వాట్స్ లోడ్ వరకు రూ.3020.
4) 2 వేల వాట్స్ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే రూ.3020 తో పాటు ప్రతి అదనపు వెయ్యి వాట్స్ కి రూ.1560 చెల్లించాల్సి ఉంటుంది.విద్యుత్ శాఖ అనుమతి లేకుండా లైన్ కి కొక్కేలు తగిలించి విద్యుత్ వాడరాదు.అలాగే వినాయక మండపాలలో నాణ్యమైన వైర్లను,స్విచ్ లను ఉపయోగించండి.ఏదయినా సమస్య ఎదురైతే వెంటనే విద్యుత్ శాఖ వారికి సమాచారం అందించాలని అన్నారు.