విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని  పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాలను ఉగ్రవాదులు హైజాక్‌ చేసే అవకాశాముందని నిఘావర్గాల హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌, జమ్మూకాశ్మీర్‌ విమానాశ్రయాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.