విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. వేపగుంట సాయిదుర్గానగర్‌, నరవరామాలయవీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. వర్షం కారణంగా ఏసీఏవైఎస్‌ఆర్‌ స్టేడియాంలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది. విశాఖ నగరంతో పాటు నక్కపల్లి పాయకరావు పేట మండలాల్లోనూ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.