*వీఆర్ఏల సమ్మెకు మాజీ ఎంపీటీసీ, ఐదవ వార్డ్ మెంబర్ నాయకులతో కలిసి మద్దతు*
కుబీర్ (జనం సాక్షి 3) తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రమైన కుబీర్ లోని తాహసిల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు శనివారం మాజీ ఎంపీటీసీ తోకల రాములు, ఐదవ వార్డ్ మెంబర్ లక్మ లక్ష్మీ విలాస్ నాయకులతో కలిసి నాయకులు మద్దతు తెలిపారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు తాహిర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తోకల రాములు, ఐదవ వార్డ్ మెంబర్ లక్మ లక్ష్మీ విలాస్, గ్రామ పెద్దలు కుబిరే హన్మండ్లు,కొట్టే గురు చరణ్, మాగం శంకర్, తిప్ప లింగన్న, పోతన్న, వీఆర్ఏలు తాహిర్, చంద్రకాంత్, భోజన్న, ఖలీల్, తదితరులు, పాల్గొన్నారు.*