వీరవనిత చాకలి ఐలమ్మ ధీరత్వం అందరికీ స్పూర్తి దాయకం :రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్
ఎల్బీ నగర్( జనం సాక్షి ) వీరవనిత మన చాకలి ఐలమ్మ ఆమె ధీరత్వం అందరికీ స్పూర్తి దాయకం అని రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్ అన్నారు శనివారం చెంప పేటలో జరిగిన సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్ పాల్గొన్నారు చాకలి ఐలమ్మకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ స్వతంత్ర భారతావనిలో ఎందరోధీరవనితలు బ్రిటిష్ వారిపై , రజాకారులపై పెత్తందారులపై పోరాటం చేసిన ధీర మహిళల్లో చాకలి అయిలమ్మ ఒకరని ఆమె పోరాటంలో కొడుకుల్ని కూతురుని భర్తని పోగొట్టుకున్నటువంటి దీరవనిత అని ఆమె బడుగు బలహీన వర్గాల కోసం ఒక స్ఫూర్తి దాత అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నారాయణ బి శ్రీనివాస్ రాము తదితరులు పాల్గొన్నారు