వెట్టి చాకిరీ నుంచి 333 మందికి విముక్తి

హైదరాబాద్‌: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వెట్టిచాకిరీ నుంచి 333 మందికి విముక్తి లభించింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులను అధికారులు రక్షించారు. వెట్టి చాకిరీ బాధితుల్లో ఒడిశాకు చెందిన 50 మంది చిన్నారులు ఉన్నారని వారు తెలిపారు.