వైద్య పరిశోధనలకు లక్ష్మీ సెహగల్‌ భౌతిక కాయం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచిన స్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ పార్థివ దేహాన్ని మంగళవారం నగరంలోని జీఎస్‌వీఎం వైద్య కళాశాలకు ఉరేగింపుగా తరలించారు. లక్ష్మీ చివరి కోరిక మేరకు వైద్య పరిశోధనల్లో ఉపయోగించేందుకు కుటుంబ సభ్యులు ఆమె భౌతిక కాయాన్ని ఈ కళాశాలకు అందజేశారు. తన తల్లి చివరి కోరిక ప్రకారం ఆమె కళ్లను దానమిచ్చియనట్లు లక్ష్మీ కుమార్తె, సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ చెప్పారు. అంతకుముందు లక్ష్మీ భౌతిక కాయానికి కేంద్ర మంత్రి వయలార్‌ రవి, సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ ఇతర ప్రముఖులు శ్రధ్ధాంజలి ఘటించారు.