వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం
టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అప్రకటిత తరచూ విద్యుత్ సరఫరా అంతరాయంతో మోటార్లు నడవక మిరప తోటలు సాగు చేసే రైతాంగం ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారు . వానలు మొఖం చాటేయడంతో మిర్చి దుక్కులు తయారై నార్లు వేతకు రావడంతో దుక్కులు తడిపి నాటు వేసే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మండుతున్న ఎండలకు తోడు విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో రైతుల తీవ్ర నిరాశ గురవుతున్నారు. వేసిన మొక్కలను బ్రతికించుకోవడం కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్న రైతులకు విద్యుత్ కోతల తో ఇబ్బందులకు గురవుతున్నారు మండలంలో గతంలో ఒకటి రెండు సబ్ స్టేషన్ లో ఉన్నప్పటికీ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతగా సమస్యలు ఏర్పడలేదని కానీ నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పడ్డాక గంటల తరబడి విద్యుత్తు సరఫరా ఆగిపోవడం మరింత దారుణంగా మారింది. వర్షాలు కురవకపోవడంతో నాటు పెట్టిన మొక్కలు ఎండకు విలవలాడుతూ ఎండిపోడుతున్నాయని రైతుల ఆవేదన గురవుతున్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలతో కూలీలతో మొక్కలు నాటే పనులు నిలిచిపోతున్నాయి . అటు కూలీలు ఇటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక విద్యుత్ సిబ్బంది విద్యుత్ అంతరాయాలకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ సరఫరా సక్రమంగా రాకపోవడంతో రైతులు విద్యుత్ సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో శాశ్వత పరిష్కారాలకు మార్గాలు అన్వేషించి వెంటనే రైతులకు మోటార్లు కాలిపోకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా, ప్రకటిత కోతలు విద్యుత్ సరఫరాను వ్యవసాయ రైతులకు అందించాలని అందుకు ఉన్నతాధికారులు పాలకవర్గాలు దృష్టి సారించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.