శస్త్రచికిత్స తర్వాత వాకర్‌ సాయంతో నడిచిన కేసీఆర్‌

 హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌ ఎడమ కాలికి యశోద ఆసుపత్రి వైద్యులు నిన్న హిప్‌ రిప్లేస్‌మెంట్‌ చేశారు.

దీంతో, ఆయనకు దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

మరోవైపు.. ఆపరేషన్‌ అనంతరం కేసీఆర్‌ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక, కాలికి ఆపరేషన్‌ తర్వాత.. నడవడానికి కేసీఆర్‌ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు కేసీఆర్‌ దగ్గరే ఉండి.. వాకర్‌ సాయంతో ఆయనను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. కేసీఆర్‌ను మైక్‌ రాక్‌స్టార్‌ అంటూ కామెంట్స్‌ చేస్తూ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ అనంతరం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.