శాసనసభను సందర్శించిన బ్రిటిష్ ప్రతినిధులు
హైదరాబాద్: రాష్ట్రంలో పదే పదే రాజీనామాలు, ఉప ఎన్నికలు జరగడంపై బ్రిటిష్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మనదేశంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా సర్ అలెస్ నేతృత్వంలోని బృందం ఇవాళ మన శాసనసభను సందర్శించింది. అసెంబ్లీ అవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రతినిధులు ఆ తార్వాత శాసన సభ్యులతో సమావేశమయ్యారు. ఆరేళ్లలో 60 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన వైనం బ్రిటన్ ప్రతినిధులకు ఆశ్చర్యపరిచింది. తమ దేశంలో రాజీనామాలు ఉండవని, ఇన్నేళ్లలో తాము ప్రవేశ పెట్టిన చట్టాన్ని తిరస్కరించినందుకు ఒకే ఒక్కరు రాజీనామా చేశారని బ్రిటన్ ప్రతినిధులు తెలిపారు.