శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు

వరంగల్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమాణారెడ్డి వరంగల్‌లో ప్రకటించారు. విద్యుత్తు సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని, ఆపార్టీ నేతలు పగటివేషగాళ్లలా వ్వవహరిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. ప్రజలకు విద్యుత్తు అసౌకర్యానికి తాము చింతిస్తున్నామన్నారు. అధికారదాహం కోసం ప్రతిపక్షాలు విద్యుత్తు సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.