శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా

Assembly adjourned for 10 minutes

హైదరాబాద్ : శాసనసభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులకు, టీఆర్‌ఎస్ సభ్యులకు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించకుండా స్పీకర్ పోడియంలోకి వెళ్లి మంత్రి జగదీష్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని మంత్రులు పేర్కొన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.