శిక్షపూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడులను చేయాలి

న్యూఢిల్లీ: సుర్జీత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌ఎం కృష్ణ తెలిపారు. పాక్‌లో శిక్షను అనుభవిస్తున్న మరో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను విడుదల చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జర్దారిని కోరినట్లు తెలిపారు. జైళ్లలో శిక్ష పూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు. సరబ్‌జిత్‌సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లు మొదట ప్రకటించి ఆ తర్వాత అతని పేరును సుర్జీతసింగ్‌ పాక్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.